తపస్వి

myriad of thoughts

Thursday, February 16, 2017

Past is always beautiful....
Even it is BAD or GOOD
because----"IT'S HAPPENED"

Wednesday, July 22, 2009

ప్రేమ...

జానకికి రాముడు ఏ క్షణాన తోడు లేడు....
నిన్ను నేను ఏ క్షణాన వీడి లేను.....
రామాయణం కంటే గొప్ప కావ్యం కాదా మనది!

Wednesday, June 17, 2009

సఖికి నా బహుమతి

నా ప్రియురాలి
ఆనంద భాష్పపు అంచు మీద నుంచొని
ఆకాశంకేసి చూస్తున్నాను....
నిండు జాబిలి జాడను
తనకు నీడగ చేద్దామని!

ఏటిలోని వేలవేల తామరలకు,
నీటిలోని నీలిమయ శోభితను కలిపి
నా సఖికి బహుమతిగా ఇచ్చి
నేను విడిపోతాను నాలుగు దిక్కులుగా
నా ప్రాణానికి పహారా కాయటానికి.!!!

Friday, December 26, 2008

???????

కాలే కడుపుకు కవిత్వం ఆమడ దూరం..
ఆకలి తీరితే కాని గుర్తుకురావు అలంకారాలైనా, ఉపమానాలైనా!
అందుకే
ఆంధ్రాలో కవుల పంటలు,
తెలంగాణాలో ఇంకిపోయిన నీటి గుంటలు.
పంచభక్ష్యాలు అవసరం లేదు ..పస్తులుంచకుండా చూడు చాలు
నిద్రపోతున్న కాళోజీలు దిగ్గున లేచి కూర్చోరూ ......!

Thursday, December 13, 2007

ఉషోదయం

హాయ్.....
చాలా రోజుల తరువాత...ఇదిగో ఇలా!
వింటారు కదూ?

ఏం చెప్పను అబ్బా..వసంతం కూడా కాదు కదా.....
లేకపోతేనేమి ఉషోదయం ఉంది కదా,సరిపోదా?
చలిలోనైనా సరే అలా బయల్దేరితే అన్నీ నీహారికలే
లేవనంటూ తనువు ...
లేచిరమ్మంటూ, నన్నిష్టపడే నేనిష్టపడే సుప్రభాత తరుణం
రెండు ఇష్టాల మధ్య
బద్ధకం బెదిరి ,కాలు కదిలి,మనసు గెలిచి
పయనం సాగదా?చలైనా సరే
తనువు ముడుచుకుంటూ ,మనసు విచ్చుకుంటూ
ఉషోదయపు ఒడిలోని నీహారికల మధ్యలోకి ..........!!!

Friday, July 6, 2007

హైకూలు .....!!!!

మల్లెల వాసన మనసుని తాకుతుంటే
పారిపోయే ఆలోచనలు ఆగిపోయి
అక్షరాలలోకి మారిపోతుంటాయి
============================

నింగి నేలపై అలిగితే
నీటి చినుకు రాలునా?
కలలు నా కళ్లపై అలిగితే
ఇక కావేరి దొరకునా?
============================
ఆపాద మస్తకం ప్రకృతినే నింపుకున్న
నా కావేరి ఉండగా
మల్లెలు ఎందుకు? వెన్నెల ఎందుకు?
లేళ్లు ఎందుకు? సెలయేళ్లు ఎందుకు?

Tuesday, May 15, 2007

నవ్వుతూ ఉండు.

ఏ నలుగురైనా నీకేసి
తినేసేలా చూస్తే
కానుకగా ఒక చిరు నవ్వుని నవ్వు।

చిన్నవాళ్లు ఎదిగివచ్చి
నీ ఎదురుగా నిలబడితే
మెచ్చుకోలుగా నవ్వు।

అమ్మయి అలిగి దూరంగా జరిగితే
ఆహ్వానిస్తూ నవ్వు।
వచ్చి సరసన చేరితేచిలిపి కళ్లతో నవ్వు।

చివరికి-- భాధలోనూ నువ్వు
నవ్వు భాధలేని నవ్వు।

ప్రియమైన నా...... నీకు--1

ప్రియమైన నా...... నీకు
ఏదో చెపుదామని ఎదురుగా వస్తే మాట తడబడిపోతుంది।తియ్యని కలలు మాత్రం మదిలోనే మిగిలిపోతున్నయి.అవి ఎప్పటికి నిజమౌతాయో తెలియదు!.ఎప్పటికైనా నా ఆశలు పూలు పూస్తాయన్న ఆశ మాత్రం తగ్గటం లేదు. బహుశా ఇది నీ పరిచయ ఫ్రభావం కావచ్చు.

నిన్ను ప్రశ్నించే ధైర్యం చాలటం లేదు- ప్రేమిస్తున్నావా అని?నేను మాత్రం ఇస్తూనే ఉన్నాను ప్రేమని-మౌనంగా.కనీసం కళ్లతోనైనా స్వీకరించు మిత్రమా. ఇది రంగుల కల కాదు ప్రియా, మనసులో అలజడి. నాకు మాత్రమే వినిపించే తియ్యని సవ్వడి. ఎంత ప్రేమ- ఇస్తున్నవు? ఎందుకు ప్రేమ- ఇస్తావు? అని నన్ను నేను ప్రశ్నించుకోను. ఎందుకంటే అవి చెప్పలేని సమాదానాలు. బహుశా ఒక చిన్న స్పర్శతో అన్నింటికీ ఒకేసారి సమాదానం చెప్పగలనేమో?.ఒక్కసారి ముట్టుకోనీ మిత్రమా, నేను నా ప్రేమని-ఇస్తున్నాను అన్న భావాన్ని ఏ చెడు ఉద్దేశ్యము లేకుండా వ్యక్త పరచటానికి మాత్రమే. ఎందుకంటే మాటతో చెప్పలేని దాన్ని మౌనంగా స్పర్శతో చెప్పగలను అన్న నమ్మకంతో.

కొన్ని thoughts

గుప్పిట్లోంచి
నీళ్లు జారిపోతున్నట్లు-
కాలం సందుల్లోంచి
ఆలోచనలు పారిపోతున్నాయి నిలకడలేకుండా!
తలా,తోకా లేనివి కొన్ని,
అర్ధం పర్ధం లేనివి కొన్ని,
స్వచ్చత లేనివి కొన్ని,
ఇష్టం లేనివి కొన్ని,
కాలం వడపోయలేక పోతుంది
అందుకే కాబోలు
వాటితోపాటు- ఆణిముత్యాల్లంటివి కూడా
బిజీ లైప్ లో ఎక్కడో తప్పిపోతున్నాయి
మేల్కోవాలి -- మౌనంగా రాసుకోవాలి
జారిపోని వీలులేని డైరీ అరలలో

Tuesday, May 8, 2007

Tuesday, February 27, 2007

ఒక మంచి పాత పాట

చిత్రం: సతీసావిత్రి(1978)
రచన: ఆత్రేయ


అతడు:యామిని భామిని ఏమనెను?
ఆమె:అది కాముని గోముల జామనెను!
అతడు:ఆగోముల కాముడు ఏమనెను?
ఆమె:కమ్మని కౌగిలి యిమ్మనెను!
ఆమె:మంచుతెరలలో మల్లెపొదలలో
మంద మారుత మేమనెను?
అతడు:మగువ మనసులో మమత పొరలలో
మసలే మరులను వినమనెను!
ఆమె:వింటే చాలదు లెమ్మనెను
ఇద్దరు:పొదరింటికి జంటగ రమ్మనెను
అతడు:చిటపట చినుకుల చిందులాటలో
చెదిరే తుంపర ఏమనెను?
ఆమె:చెలి కన్నులలో చెడుగుడులాడే
చిలిపితనాలను చూడమనెను!
అతడు:చూస్తేచాలదు లెమ్మనెను
ఇద్దరు:చవి చూద్దువుగాని రమ్మనెను
ఆమె:గాలికి కదిలే ఆకుల
గలగల రవళులు ఏమనెను?
అతడు:కన్నె ఎదలలో సన్నని వీణకు
శృతికలిపి నిన్నూవినమనెను!
ఆమె:వింటే చాలదు లెమ్మనెను
ఇద్దరు:విరివింటిని ఓడించి రమ్మనెను

Sunday, February 18, 2007

నా డ్రీం గర్ల్......


Friday, February 16, 2007

హృదయలేఖ నా సఖికి.....


నీవు మీ పుట్టింటికి వెళ్ళావో లేదో నా గుండె గూటిలోని భావాలకు రెక్కలొచ్చి..ఇదిగో ఇలా కాగితం పైకి వచ్చి..నిన్నుచేరేవరకు నిలవలేనంటున్నాయి..ఊరకనే కాదు సుమా!!..కొత్తపరిమలాలతో ..సుమీ మన ఎర్ర గులాబీ ఎంత అందంగా ఉందో తెలుసా?...మంచు బిందువులు ఇంకా సూర్ర్యుడి కౌగిలిలో కరిగిపోలేదనుకుంటా?.ఉషోదయం కదా!.నీవు స్నానం చేసి పెదాలపై నీరు సరిగా ఆరకముందు ఉంటావు చూడు అంత అందంగా ఉంది..మల్లెలు మాత్రం ఏంతక్కువ తిన్నై,నా ప్రియ సఖి ఏదా అని తొంగి మరీ చుస్తున్నయి..నువ్వు వచ్చాక తేల్చాలి నీవు నాకు సఖియో లేక మల్లెలకో ..లేకపోతేమరి ,ఎంతగా ఉడుక్కున్నానో నీకేం తెలుసు?.నువ్వు వచ్చేటప్పుడు బోల్డన్ని మాటల్ని తీసుకురా,సరేనా?..............పేరుకే దూరమై ఎప్పుడూ నీ ప్రక్కనే ఉండే .......
నీ.....

Thursday, February 15, 2007

నా చెలి కోరిక .....




















కుంగేప్రొద్దులోని వర్ణాలను చూస్తూనే ఉన్నావుగా?ప్రకృతిలోని వేలవేల రంగుల్ని పరికిస్తూనే ఉన్నావుగా?ఇంకా మారాం చేస్తావేంటి!అరె......!!ఆ పెదవుల్లో అలజడేంటి?నాకేసి కోపంగా చూసే ఆ చూపేంటి ?ఓ .....సిగ్గుతో వంగిన హరివిల్లే కావాలా...?ఆగుమరి ...ఎండ ఒడిలోకి చినుకులు తొంగి చూడొద్దా ...?నీలి నింగిలోకి రంగులు ఒంగిపోవద్దా ??

Wednesday, February 14, 2007

వసంతం!! ........నా ప్రియసఖి!!



వస్తూ,వస్తూ....మామిడి పూతల్ని,కొయిల గీతాల్ని తెస్తూ,పోతూ,పోతూ.....మల్లెల సౌరభాల్ని వదిలేసి వెల్తది----మనసునిండా తురుముకోండి అని.మామిడిపూతతో సింగారించుకొని తొంగిచూసింది వసంతం .ఏది ?కొయిల కనబడదేం !!ఆ ...అదిగో ....... చిగురులను తినిపించవద్దా ?కుహూ ...కుహూ ....సరిగా పలకొద్దా మరి!!సృష్టి అనాదినుంచీ ఒకటే పాట,కుహూ..కుహూ...అని ఎంత తియ్యందం ఆ గొంతులో !అందుకే కాబోలు విసుగనిపించదు మరి
ఇంత అందమైన వసంతపు అంచులో ,ఇంటి వరండాలో కూర్చొని ఉంటే ఒక్కసారిగా ఒచ్చి ప్రక్కన కూర్చుంది నా ప్రియసఖి .....నా భార్య !!!కాటుక నలుపు కళ్ళతో ,కోయిల గొంతుకతో .!తడిసిన పెదాలను తుడవకుమా...అలానే ఉండనీ ...మంచులో తడిసిన గులాబీలా !!!నొచ్చుకొంది కాబోలు వసంతం పారిపోయింది కొయిలని తీసుకొని ,గ్రీష్మాన్ని వదిలి.అయితేనేం ?నా ప్రక్కనే ఉందిగా వసంతం ,మల్లెలు తురుముకొని!!!!!

Tuesday, February 13, 2007

నేను ఒంటరినా?...



నేను ఒంటరినా?.......
కాదు సుమా!!!!!........నాతో పాటు బోల్డన్ని గత స్మృతులు
ప్రస్తుత స్థ్తితులు.....నా ప్రక్కనే నా డైరీ....
అందులో.............
నన్ను ఎడిపించిన క్షణాలు, నేను ఎడిపించిన క్షణాలు ..
పుటల కొద్దీ...భావాల అలలు ....
అక్కడక్కడ కవితలు , ఎక్కడో ఒక చోట కలలు ....
నన్ను నేను ప్రేమించికుంటు ................
ఇప్పుడు చెప్పండి నేను ఒంటరినా?.....కాదు కదా ?!!

నా స్వప్నం


లేలేత రవి కిరణాలకు సయితం వాడిపోవునేమో అనిపించే, నా తియ్యని కలల సుమాలను,
ఆమని ఉసోదయపు ఒడిలొ కూర్చొని,
మాలగ కూర్చి ,
తదుపరితియ్యని హాయిగ మార్చి.......
.నా డైరీలొ చేర్చ ....

Sunday, February 11, 2007

beautiful eyes


ఎంత అందమైన కళ్లో కద!!!!!!!!!!!!!
అన్ని ఋతువులను మరిపించె ఆ కళ్లు,
ఏన్నో మధుర భావాల లోగిళ్ళు.
అమాయకత్వపు చిలిపి చెలిగాడి కొసం కాబోలు....
మీనపు నయనాలు మౌనంగా చూస్తున్నాయి..!!